రైతుల సంక్షేమానికి ప్రభుత్వం ప్రత్యేకంగా కృషి చేస్తుందని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా సంగారెడ్డి పరేడ్ మైదానంలో ప్రజలను ఉద్దేశించి గురువారం ఆయన మాట్లాడారు. ఎందరో త్యాగాల పోరాటం కారణంగా మనకు స్వాతంత్రం వచ్చిందని చెప్పారు. ప్రజల సంక్షేమానికి ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకుంటుందని పేర్కొన్నారు.