కొండాపూర్ మండలం మల్కాపూర్ చౌరస్తా వద్ద భారీ గుంతలతో వాహనదారులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. రాత్రి సమయంలో ద్విచక్ర వాహనదారులు గుంతలు గమనించకపోవడంతో తరచుగా ప్రమాదాలకు గురవుతున్నారని స్థానికులు తెలిపారు. గుంతలను పూడ్చివేయాలని అధికారులకు విన్నవించిన పట్టించుకోవడంలేదని ఆరోపించారు. అధికారులు స్పందించాలని కోరుతున్నారు.