తెలంగాణ వీర నారి చాకలి ఐలమ్మ 129వ జయంతి సందర్బంగా ఫోరమ్ ఫర్ బెటర్ సంగారెడ్డి ఆధ్వర్యంలో సంగారెడ్డిలో ఐలమ్మ విగ్రహనికి పూలమాల వేసి నివాళులు అర్పించారు ఫోరమ్ ఫర్ బెటర్ సంగారెడ్డి నాయకులు. ఈ కార్యక్రమంలో ఫోరమ్ ఉపాధ్యక్షులు సజ్జద్ ఖాన్, ప్రధాన కార్యదర్శి అమిదిపురం మహేష్ కుమార్, సహా కార్యదర్శి శ్రీకాంత్, కార్యవర్గ సభ్యులు సాయి, బహుజన నాయకులు, తదితరులు పాల్గొన్నారు.