16 కులాలకు కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మకమని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకుడు నీలం మధు అన్నారు. బుధవారం చిట్కుల్ లోని క్యాంపు కార్యాలయంలో రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు.
ఈ సందర్భంగా నీలం మధు ముదిరాజ్ మాట్లాడుతూ ఇందిరమ్మ స్ఫూర్తితో రాష్ట్రంలో పాలన కొనసాగిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేస్తున్నారన్నారు.