స్వచ్ఛత హీ సేవ కార్యక్రమంలో భాగంగా సంగారెడ్డి మున్సిపాలిటీ ఆధ్వర్యంలో విద్యార్థులతో రన్ కార్యక్రమం శనివారం నిర్వహించారు. మున్సిపల్ కమిషనర్ ప్రసాద్ చౌహన్ మాట్లాడుతూ స్వచ్ఛత కార్యక్రమం పై ప్రతి ఒక్కరూ పరిశుభ్రత పాటించాలని, ఇందులో భాగంగా ర్యాలీ, మారథాన్ రన్, వర్క్‌షాప్‌లు, అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.