సంగారెడ్డి: ఘనంగా అయ్యప్ప స్వామి మహా పడిపూజ

84చూసినవారు
మండల పూజా మహోత్సవం సందర్భంగా సంగారెడ్డి లోని శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి దేవాలయంలో మహా పడిపూజ కార్యక్రమం గురువారం రాత్రి ఘనంగా నిర్వహించారు. గంగాధర్ శర్మ వేదమంత్రాలతో స్వామివారి పూజా కార్యక్రమాన్ని జరిపించారు. గురుస్వాములు పాడిన పాటలు ఆకట్టుకున్నాయి. దేవాలయ కమిటీ చైర్మన్ కొక్కంట శ్రీశైలం, గురు స్వాములు వెంకన్న, తిరుపతిరెడ్డి, విష్ణువర్ధన్ రెడ్డి, రవీందర్ రెడ్డి జిట్ట రవీందర్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్