సంగారెడ్డి: కాంగ్రెస్ ప్రభుత్వానికి రైతుల ఉసురు తగులుతుంది

56చూసినవారు
రైతులకు సంకెళ్లు వేసిన కాంగ్రెస్ ప్రభుత్వానికి వారి ఉసురు తగులుతుందని ఎంపీ ఈటెల రాజేందర్ అన్నారు. కంది సెంట్రల్ జైలులో ఉన్న లగచర్ల రైతులను మరో ఎంపీ డేకే అరుణతో కలిసి సోమవారం పరామర్శించారు. ఆయన మాట్లాడుతూ గతంలో టిఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో ఖమ్మం రైతులకు సంకెళ్లు వేసినందుకు ఆ పార్టీకి పట్టిన గతే కాంగ్రెస్ కు పడుతుందని విమర్శించారు. సమావేశంలో జిల్లా అధ్యక్షులు గోదావరి పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్