కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని టిపిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. కొండాపూర్ మండలం మల్కాపూర్ శివారులోని శ్రీ వెంకటేశ్వర గార్డెన్లో కార్యకర్తల సమావేశం సోమవారం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ఎన్నికల ముందు హామీ ఇచ్చిన విధంగా 6 గ్యారంటీలను అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. సమావేశంలో మంత్రి దామోదర రాజనరసింహ, ఎమ్మెల్యే సంజీవ రెడ్డి, జగ్గారెడ్డి పాల్గొన్నారు.