స్వాతంత్ర సమరయోధుడు, అహింస మూర్తి మహాత్మా గాంధీ 75 వ వర్ధంతి సందర్భంగా ఫోరమ్ ఫర్ బెటర్ సంగారెడ్డి ఆద్వర్యంలో సంగారెడ్డి జిల్లా కేంద్రంలో మహాత్మా గాంధీ విగ్రహనికి పులా మాల వేసి నివాళులు అర్పించిన ఫోరమ్ ఫర్ బెటర్ సంగారెడ్డి అధ్యక్షుడు శ్రీధర్ మహేంద్ర. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ అహింస మార్గం ద్వారా భారత స్వాతంత్ర్యం కోసం దేశ వ్యాప్తంగా కుల మతాలకు అతీతంగా ప్రజల్ని ఏకం చేయడంలో కీలక పాత్ర పోషించిన మహనీయునిగా మహాత్మా గాంధి దేశ స్వాతంత్ర్య చరిత్రలో నిలిచారని మహాత్మా గాంధి స్ఫూర్తి తో నేటి సమస్యల పై అహింస మార్గం ద్వారా ఉద్యమించాలి అని అన్నారు. ఇట్టి కార్యక్రమములో ఫోరమ్ ఫర్ బెటర్ సంగారెడ్డి ఉపాధ్యక్షుడు సజ్జాద్ ఖాన్, ప్రధాన కార్యదర్శి అమిదిపురం మహేష్ కుమార్, సహా కార్యదర్శి శ్రీకాంత్, కార్య వర్గ సభ్యులు సాయి వారాల తదితరులు పాల్గొన్నారు.