గుండె సమస్యతో యువ రైతు మృతి
గుండె సమస్యతో యువ రైతుమృతి చెందిన సంఘటన టేక్మాల్ మండలం షాబాద్ తండాలో శుక్రవారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన రమావత్ శివరాత్ (39)కి గతంలో గుండె ఫోటో రావడంతో ఆపరేషన్ జరిగింది. అదే సమస్యతో మృతి చెందినట్లు గ్రామస్తులు తెలిపారు. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. యువ రైతు మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి.