ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 5 నెలలు కావొస్తుంది. ఇప్పటివరకు పెద్దగా ఆర్థిక భారం పడని హామీలపైనే ప్రభుత్వం దృష్టి సారించింది. కీలకమైన పేదల గృహ నిర్మాణం, తల్లికి వందనం, మహిళలకు ఉచిత బస్సు, మహాశక్తి పథకాల కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారు. అయితే రాష్ట్ర ఆర్థిక స్థితులు ఇంకా గాడిలో పడలేదు. రాష్ట్ర ఖజానా ఖాళీగా ఉండటంతో కూటమి ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగుతోంది. అయితే సీఎం చంద్రబాబు ఏమాత్రం సంకోచించడం లేదు. దశలవారీగా హామీలు నెరవేరుస్తామని భరోసా ఇస్తున్నారు.