Mar 03, 2025, 01:03 IST/
కేంద్ర మంత్రి ఖడ్సే కుమార్తెకు పోకిరీల వేధింపులు
Mar 03, 2025, 01:03 IST
మహారాష్ట్రలో శాంతిభద్రతలపై కేంద్ర యువజన వ్యవహారాల శాఖ సహాయ మంత్రి రక్షా ఖడ్సే ఆందోళన వ్యక్తం చేశారు. జల్గావ్ జిల్లా ముక్తాయ్నగర్లో ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న తన కుమార్తెను కొందరు యువకులు వేధించారని పేర్కొన్నారు. ఇందుకు సంబంధించి తాజాగా పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు. ఈ ఘటనపై సీఎం దేవేంద్ర ఫడణవీస్ స్పందించారు. నిందుతులలో కొందర్ని పోలీసులు అరెస్టు చేశారని పేర్కొన్నారు.