తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటుతున్నాయి. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తన నివాసంలో కుటుంబ సభ్యుల మధ్య పండుగ వేడుకలను నిర్వహించారు. ఎమ్మెల్సీ కవిత స్వయంగా ముగ్గులు వేసి సంక్రాంతి వేడుకల్లో పాలుపంచుకున్నారు. రాష్ట్ర ప్రజలు, రైతాంగం.. పాడిపంటలు, సిరి సంపదలు, సుఖసంతోషాలతో ఉండాలని కోరుకున్నారు. ఈ సందర్భంగా ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు.