‘అదానీ, అంబానీ వంటి క్రోనీ క్యాపిటలిస్ట్‌ల నుంచి జార్ఖండ్‌ను రక్షించండి’ అని తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. జార్ఖండ్‌లోని రాంఘర్ నియోజకవర్గంలో అక్కడి అభ్యర్థి తరపున కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్ భట్టి విక్రమార్క ఆదివారం ప్రచారం చేపట్టారు. ఇండియా కూటమి అభ్యర్థులను భారీ మెజార్టీ గెలిపించి, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని పిలుపునిచ్చారు.