ఇంటర్ కళాశాలలోని బాలికల వాష్ రూమ్‌లో సీక్రెట్ కెమెరాను అమర్చిన బాలుడిపై కేసు నమోదైంది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని సోన్‌భద్రలో వెలుగు చూసింది. కాలేజీ వాష్ రూమ్‌కు నిందితుడి ఇంటి గోడ ఆనుకొని ఉంది. దీన్ని అవకాశంగా తీసుకున్న 17 ఏళ్ల బాలుడు మినీ కెమెరాను అమర్చి తన కెమెరాకు కనెక్ట్ చేశాడు. ఈ విషయం తెలుసుకున్న బాలికలు నిన్న కళాశాల వద్ద ఆందోళనకు దిగారు. యాజమాన్యాన్ని నిలదీశారు. పోలీసులు కేసు నమోదు చేశారు.