భారత్, ఇంగ్లండ్ మధ్య రాంచీ వేదికగా జరగనున్న నాలుగో టెస్టు మ్యాచ్ ను చెదరగొట్టేందుకు అమెరికా ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నున్ ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది. దీంతో రాంచీలో భారీ సంఖ్యలో భద్రతను పెంచారు. కాగా ఈ టెస్టు మ్యాచ్ను అడ్డుకోవాలంటూ గురుపత్వంత్ సింగ్.. సీపీఐ దళాన్ని కోరారు. ఈ మేరకు ఓ వీడియోను సోషల్ మీడియాలో విడుదల చేశారు.