సేనాపతికి అప్పుడు 75.. ఇప్పుడు 103

68చూసినవారు
సేనాపతికి అప్పుడు 75.. ఇప్పుడు 103
భారతీయుడు-2లో వృద్ధుడైన సేనాపతి పాత్రలో కమల్‌హాసన్‌ ఫైట్స్‌ చేయడంపై సోషల్‌మీడియాలో చర్చ నడుస్తోంది. ‘భారతీయుడు’ చిత్రంలో సేనాపతి పాత్రకు వయసు 75ఏళ్లుగా చూపించారు. ఆ లెక్క ప్రకారం 2024కు వచ్చే సరికి ఆ పాత్ర వయసు 103 సంవత్సరాలు. అంత వయసున్న వృద్ధుడు మార్షల్‌ ఆర్ట్స్‌ ఫైట్స్‌ చేయడమేంటని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. సేనాపతిని సాధారణ వ్యక్తిగా చూడొద్దని, సూపర్‌హీరోగా చూడాలంటూ దర్శకుడు శంకర్ చెప్పారు.