హింసా ప్రవృత్తితో స్త్రీ ఇష్టానికి వ్యతిరేకంగా లైంగిక అపచారం చేయడం అత్యాచార నేరంగా పరిగణిస్తారు. సెక్షన్ 376ఎ నుంచి 'డి' వరకు క్లాజులలో సందర్భం, తీవ్రతను బట్టి శిక్షలు ఖరారు చేస్తారు. సెక్షను 376(1) ప్రకారం ఏడేళ్లకు తగ్గకుండా పదేళ్ల వరకు, ప్రత్యేక సందర్భాల్లో జీవితకాలం వరకు జైలుశిక్ష జరిమానా విధించే అవకాశముంది. నిర్భయ చట్టం కింద కేసు నమోదై విచారణలో దోషులుగా తేలితే ఉరిశిక్ష విధించే అవకాశం ఉంది.