ఆస్ట్రేలియా-న్యూజిలాండ్ మధ్యలో టాస్మాన్ సముద్రంలో రెండు లైవ్ ఫైర్ డ్రిల్స్‌ను చైనా నేవీ నిర్వహించింది. ఈ నేపథ్యంలో ఇరుదేశాలకు చెందిన ప్రయాణికుల విమానాలకు ఎటువంటి హెచ్చరికలు లేకపోవడంతో తమ మార్గాలను మధ్యలోనే మళ్లించుకోవాల్సి వచ్చింది. దీనిపై న్యూజిలాండ్ రక్షణమంత్రి స్పందిస్తూ ఈ విన్యాసాలు అసాధారణమని పేర్కొన్నారు.