ఆస్ట్రేలియాతో జరిగే బోర్డర్-గవాస్కర్ ట్రోఫీకి టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ షమీ ఎంపిక కాని విషయం తెలిసిందే. రీఎంట్రీపై అంచనాలను అందుకోకపోవడంతో అతడిని బీసీసీఐ పక్కన పెట్టింది. దీనిపై షమీ స్పందించాడు. ''తీవ్రంగా ప్రయత్నిస్తున్నాను. బౌలింగ్ ఫిట్నెస్లో రోజురోజుకూ మెరుగుపడుతున్నాను. క్రికెట్ అభిమానులకు, బీసీసీఐకి క్షమాపణలు. అయితే అతి త్వరలో రెడ్ బాల్ క్రికెట్కు తిరిగొస్తాను'' అని పేర్కొన్నాడు.