పరువు నష్టం కేసులో ట్రంప్‌కు షాక్

62చూసినవారు
పరువు నష్టం కేసులో ట్రంప్‌కు షాక్
అమెరికా అధ్యక్ష ఎన్నికలకు ముందు మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌కు భారీ షాక్ తగిలింది. ప్రముఖ రచయిత్రి జీన్ కారోల్ వేసిన పరువు నష్టం కేసులో న్యూయార్క్‌లోని మాన్‌హటన్ ఫెడరల్ కోర్టు కీలక తీర్పు వెలువరించింది. జీన్ కారోల్‌కు 83 మిలియన్ డాలర్ల పరిహారం చెల్లించాలని ట్రంప్‌కు ఆదేశించింది. కాగా, ట్రంప్ తనను లైంగికంగా వేధించాడని కారోల్ గతంలో ఆరోపించింది.

సంబంధిత పోస్ట్