ఉత్తరప్రదేశ్ లోని లక్నోలో దారుణ ఘటన చోటు చేసుకుంది. గుర్తు తెలియని వ్యక్తి యాసిడ్ విసిరిన ఘటనలో 21 ఏళ్ల మహిళ, ఆమె తమ్ముడు గాయపడ్డారని పోలీసులు బుధవారం తెలిపారు. రోడ్డు పక్కన తన సోదరుడితో కలిసి నిలబడి ఉన్న మహిళపై, ఆమె కజిన్ సోదరుడిపై గుర్తు తెలియని వ్యక్తి యాసిడ్ దాడి చేశారని అదనపు పోలీసు కమిషనర్ దుర్గేష్ కుమార్ తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.