NEET వివాదంపై సుప్రీం కీలక వ్యాఖ్యలు

61చూసినవారు
NEET వివాదంపై సుప్రీం కీలక వ్యాఖ్యలు
NEET-UG 2024 కేసుపై విచారణ చేపట్టిన సుప్రీం కోర్టు. వ్యవస్థను మోసం చేసిన వ్యక్తి డాక్టర్ అయితే సమాజానికి మరింత హానికరమని వ్యాఖ్యానించింది. పరీక్షకు సిద్ధమైన పిల్లల కష్టాన్ని మరిచిపోవద్దని, 0.001% నిర్లక్ష్యం ఉన్నా దానిని పూర్తిగా పరిష్కరించాలని కేంద్రం, NTAని ఆదేశించింది. NEET-UG, 2024లో జరిగిన అవకతవకలకు సంబంధించిన అభ్యర్థనలపై నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ప్రతిస్పందించాలని నోటీసులు జారీ చేసింది.