వింటర్ సీజన్‌లో పుల్లటి పండ్లు తినకూడదని అనేక మంది భావిస్తుంటారు. ఇవి తినడం వల్ల జలుబు, కఫం వంటి సమస్యలు వస్తాయనుకుంటుంటారు. అయితే చలికాలంలో నారింజ పండ్లు తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుందని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. నారింజలో విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇది విషాన్ని బయటకు పంపడానికి, ఫ్రీ రాడికల్స్ నుంచి నష్టాన్ని నివారించడానికి సహాయపడుతుందని సూచిస్తున్నారు.