భారత క్రికెటర్ శ్రేయాస్ అయ్యర్ తాజాగా కోల్‌కతా నైట్‌రైడర్స్ మేనేజ్‌మెంట్‌పై అసహనం వ్యక్తం చేశాడు. కేకేఆర్ గత ఐపీఎల్ సీజన్‌లో శ్రేయస్ నాయకత్వంలోనే విజేతగా నిలిచింది. అయినా కూడా కేకేఆర్ శ్రేయాస్‌ను రిటైన్ చేసుకోలేదు. ఈ విషయంపై కేకేఆర్ నుంచి తనకు సరైన సమాచారం లేదని మేనేజ్‌మెంట్‌పై శ్రేయాస్ అయ్యర్ అసహనం వ్యక్తం చేశారు. 2025 ఐపీఎల్ మెగా వేలంలో శ్రేయాస్‌ను పంజాబ్ కింగ్స్ రూ.26.75 కోట్లు వెచ్చించి కొనుగోలు చేసింది.