Nov 29, 2024, 06:11 IST/సంగారెడ్డి నియోజకవర్గం
సంగారెడ్డి నియోజకవర్గం
మునిపల్లి మండలంలో రోడ్డు ప్రమాదం
Nov 29, 2024, 06:11 IST
మునిపల్లి మండలం బుధేరా కూడలి వద్ద జాతీయ రహదారిపై గురువారం తెల్లవారు జామున జరిగిన రోడ్డు ప్రమాదంలో యువకుడు దుర్మరణం చెందాడు. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఎస్సై రాజేష్ నాయక్ తెలిపిన వివరాలు.. హైదరాబాద్కు పాలు తరలిస్తున్న మినీ ట్యాంకర్ను బుధేరా కూడలి వద్ద లారీ ఢీకొట్టింది. ట్యాంకర్లో ప్రయాణిస్తున్న కర్ణాటకకు చెందిన రామారావు (35) స్పాట్లోనే మృతి చెందాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.