వైన్స్ షాప్ ను తనిఖీ చేసిన ఎక్సైజ్ అధికారులు
అక్కన్నపేట మండల కేంద్రంలో కల్తీ మద్యం విక్రయిస్తున్న ఖుషి వైన్స్ లో ఎక్సైజ్ ఎస్సై రూప మంగళవారం తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీలలో భాగంగా మద్యానికి సంబంధించిన డైల్యూషన్ పరీక్షలు చేశామని, బీరుకు సంబంధించిన నమూనాలను సేకరించి ప్రయోగశాలలో పరీక్షించేందుకు పంపించినట్లు సిఐ పవన్ వెల్లడించారు. విచ్చలవిడిగా బెల్ట్ షాపులకు అధిక ధరలతో మద్యాన్ని అమ్మినట్లు సమాచారం అందినట్లయితే చర్యలు తీసుకుంటామన్నారు.