తిరగబెట్టే లేదా మెటాస్టాటిక్ నాసోఫారింజియల్ కార్సినోమా చికిత్స కోసం భారత్‌లో తొలిసారిగా టోరిపాలిమాబ్ అనే ఇమ్యునో–ఆంకాలజీ ఔషధాన్ని డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్ విడుదల చేసింది. నాసోఫారింజియల్ కార్సినోమా అనేది తల, మెడ క్యాన్సర్‌కు సంబంధించింది. ఇది గొంతు పైభాగంపై చోటు చేసుకుంటుంది. భారత్‌లో జైటోర్వి బ్రాండ్ పేరుతో ఈ ఔషధాన్ని మార్కెట్ చేయనున్నట్లు తెలిపింది.