బెజ్జంకి: రోడ్డు దాటుతుండగా ప్రమాదం.. వ్యక్తి మృతి
బెజ్జంకి: ద్విచక్ర వాహనంపై రోడ్డు దాటుతుండగా కారు ఢీకొనడంతో వ్యక్తి మృతి చెందిన ఘటన మండల పరిధిలోని గాగిల్లాపూర్ స్టేజి రాజీవ్ రహదారిపై ఆదివారం జరిగింది. హైదరాబాద్ నుంచి కరీంనగర్ వెళ్తున్న కారు అతివేగంగా వచ్చి బెజ్జంకి క్రాసింగ్ వద్ద గ్రామానికి చెందిన బింగి స్వామి (42) బైక్ ను ఢీకొనడంతో తలకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే 108 అంబులెన్స్ లో సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మృతి చెందాడు.