Oct 28, 2024, 10:10 IST/జహీరాబాద్ నియోజకవర్గం
జహీరాబాద్ నియోజకవర్గం
మొగుడంపల్లి: మద్యం దుకాణంలో భారీ అగ్ని ప్రమాదం
Oct 28, 2024, 10:10 IST
మొగుడంపల్లి మండల కేంద్రంలోని మద్యం దుకాణంలో భారీ అగ్ని ప్రమాదం ఆదివారం చోటు చేసుకుంది. బస్టాండ్ రోడ్డులో రేణుక ఎల్లమ్మ మద్యం దుకాణం షెట్టర్ నుంచి పొగలు వస్తున్న విషయాన్ని స్థానికులు గుర్తించారు. వెంటనే వైన్స్ నిర్వాహకులకు షెట్టర్ తాళాలు తీయడంతో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. సిబ్బంది, ఎక్సైజ్ శాఖ అధికారులకు సమాచారం ఇవ్వగా వారు వచ్చి మంటలార్పేశారు. మద్యం బాటిళ్లతోపాటు ఫర్నిచర్ పూర్తిగా కాలి బూడిదయ్యాయి. రిఫ్రిజిరేటర్లో షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ ప్రమాదం జరిగిందని తెలిసింది.