చిన్నకోడూర్: శాకాంబరిగా రేణుకా ఎల్లమ్మ

59చూసినవారు
చిన్నకోడూర్: శాకాంబరిగా రేణుకా ఎల్లమ్మ
ఆషాడ మాసాన్ని పురస్కరించుకొని ఆదివారం చిన్నకోడూర్ మండల కేంద్రంలోని రేణుకా ఎల్లమ్మ తల్లిని గౌడ సంఘం సభ్యులు పలు రకాల కూరగాయాలతో అలంకరించారు. అమ్మవారు భక్తులకు శాకాంబరిగా దర్శనమిచ్చారు. అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. భక్తులు అమ్మవారికి నైవేద్యాలు సమర్పించి, మొక్కులు చెల్లించుకున్నారు. తమ పిల్లాపాపలను సల్లంగా చూడాలని అమ్మవారిని వేడుకున్నారు.

ట్యాగ్స్ :