దుబ్బాక మున్సిపల్ పరిధిలోని లచ్చపేట మోడల్ స్కూల్లో రాజ్యాంగ దినోత్సవం ఘనంగా జరిపారు. ఈ సందర్బంగా మంగళవారం విద్యార్థులకు వ్యాసరచన, చిత్రలేఖన, క్విజ్ పోటీలు నిర్వహించి, గెలుపొందిన విద్యార్థులకు బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ బుచ్చిబాబు, ఉపాధ్యాయులు నాగరాజు, మధన్మోహన్, శ్రీనివాస్ పాల్గొన్నారు.