సిద్ధిపేట జిల్లా కొండపాక, బందారం పరిధిలోని 33 కేవీ సబ్ స్టేషన్ మరమ్మతులలో భాగంగా మంగళవారం కొండపాక మండలంలోని పలు గ్రామాల్లో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్తు సరఫరా పూర్తిగా నిలిచిపోతుందని ఏఈ సత్యం సోమవారం తెలిపారు. మండలంలోని కొండపాక, బందారం, అంకిరెడ్డిపల్లి, మర్పడగ, సిరిసినగండ్ల, ఖమ్మంపల్లి, గిరాయిపల్లి, దమ్మక్కపల్లి, నాంచార్ పల్లి గ్రామాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోతుందన్నారు.