సిద్దిపేట జిల్లా చేర్యాల మండలం నాగపురిలో విషాదం చోటుచేసుకుంది. కుళాయి నీటిని పట్టే క్రమంలో ఓ బాలిక తన పుట్టినరోజు నాడే విద్యుదాఘాతానికి గురై దుర్మరణం పాలైంది. కొమురవెల్లి ఎస్సై రాజు వివరాల ప్రకారం.. గురువారం ఇంటి సంపులోని కుళాయి నీటిని ట్యాంకులోకి ఎక్కించేందుకు కావ్య ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో విద్యుత్తు మోటారు తీగ తగిలి విద్యుదాఘాతానికి గురైంది. కుటుంబీకులు బాలికను ఆసుపత్రికి తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందిందని తేల్చారు.