గురుకుల విద్యార్థులకు పౌష్టికాహారం అందించాలని రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. సోమవారం హుస్నాబాద్ జిల్లెలగడ్డలోని గురుకుల పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసి పాఠశాలలోని విద్యార్థులకు అందించే తాగునీటి వాటర్ ప్లాంట్ ను పరిశీలించారు. నిత్యం క్లినింగ్ చేసి తాగునీరు అందించాలని ఆదేశించారు. విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణకు ప్రభుత్వం డైట్ చార్జీలను పెంచిందని, పోషకాలు ఉండే ఆహారం అందించాలన్నారు.