క్రీడలు మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయి: జడ్జి శివరంజని

910చూసినవారు
క్రీడలు మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయి: జడ్జి శివరంజని
హుస్నాబాద్: క్రీడలు పిల్లల ఆత్మవిశ్వాసం స్థాయిని, మానసిక ఉల్లాసాన్ని పెంపొందించుకోవడంలో ఎంతగానో సహాయపడతాయనీ హుస్నాబాద్ మెజిస్ట్రేట్ జడ్జి శివరంజని అన్నారు. హుస్నాబాద్ పట్టణంలోని మాంటిస్సోరి కృష్ణవేణి టాలెంట్ హైస్కూల్ మైదానంలో శనివారం క్రీడా ముగింపు ఉత్సవ వేడుకల్లో వారు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ క్రీడలు శారీరక వికాసంతో పాటు మానసిక వికాసాన్ని పెంపొందిస్తాయని తెలిపారు. విద్యార్థులు నేర ప్రవృత్తి లక్షణాలకు దూరంగా ఉండాలని, ప్రతి విద్యార్థి నైతిక విలువలను అలవర్చుకోవాలని ముఖ్యంగా సామాజిక మాధ్యమాల యొక్క ప్రభావం నేటి విద్యార్థుల పై అధికంగా ఉందని వాటికి దూరంగా ఉండాలని సూచించారు.

సంబంధిత పోస్ట్