తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరిగే క్రిస్మస్ పండుగను క్రైస్తవులు అందరూ ఘనంగా జరుపుకోవాలని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మాత్యులు పొన్నం ప్రభాకర్ ఆకాంక్షించారు. ఆదివారం హుస్నాబాద్ నియోజకవర్గంలోని క్రైస్తవ సోదరులకు మంత్రి పొన్నం క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ ఏసుక్రీస్తు కృపతో క్రిస్మస్ పండుగ ప్రజలందరూ ఆనందంగా, సుఖసంతోషాలతో జరుపుకోవాలని ప్రార్థించారు.