ఎక్సైజ్ చట్టాన్ని ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవు

57చూసినవారు
ఎక్సైజ్ చట్టాన్ని ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవు
ఎక్సైజ్ చట్టాలను ఉల్లంఘించి చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఎక్సైజ్ సిఐ పవన్ హెచ్చరించారు. హుస్నాబాద్ పట్టణంలోని ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అక్కన్నపేట, కోహెడ మండలాల్లో శుక్రవారం నిర్వహించిన వాహన తనిఖీల్లో తరిగొప్పుల మండలం బొత్తలపర్రె తండాకు చెందిన ఒక వ్యక్తి బైక్ పై నాలుగు లీటర్ల గుడుంబా రవాణా చేస్తుండగా పట్టుకున్నట్లు తెలిపారు.