Oct 28, 2024, 04:10 IST/
హైదరాబాద్ లో నెల రోజులపాటు ఆంక్షలు
Oct 28, 2024, 04:10 IST
హైదరాబాద్ లో నవంబర్ 28 వరకు నెల రోజులపాటు ఆంక్షలు విధిస్తున్నట్లు సీపీ సీవీ ఆనంద్ ప్రకటించారు. పలు సంస్థలు, పార్టీలు శాంతి భద్రతలకు భంగం కలిగించే అవకాశం ఉందని సమాచారం రావడంతో ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. సభలు, సమావేశాలు, ధర్నాలు, రాస్తారోకోలు, ర్యాలీలపై నిషేధం ఉంటుందని, ఒకే చోట ఐదుగురు కంటే ఎక్కువ మంది గుమిగూడొద్దని, నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవని హెచ్చిరించారు.