Oct 23, 2024, 09:10 IST/
PMSBY.. రూ.20 చెల్లిస్తే ఏడాది పాటు రూ.2 లక్షల బీమా
Oct 23, 2024, 09:10 IST
పేద ప్రజల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన (PMSBY) అమలు చేస్తోంది. కేవలం రూ.20 చెల్లిస్తే ఏడాది కాలవ్యవధిలో రూ.2 లక్షల బీమా సదుపాయాన్ని ఈ పథకంలో పొందొచ్చు. పాలసీదారు చనిపోయినా, అంగవైకల్యం ఏర్పడినా రూ.2 లక్షలను కేంద్ర ప్రభుత్వం అందిస్తుంది. ఈ పథకంలో 18-70 ఏళ్ల వయస్సులో ఉన్న వారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పథకం కోసం సమీప బ్యాంకులను సంప్రదించవచ్చు.