Oct 24, 2024, 12:10 IST/
దారుణం.. స్నేహితులతో కలిసి తల్లిని హత్య చేసిన కొడుకు
Oct 24, 2024, 12:10 IST
యూపీలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఘజియాబాద్‌కు చెందిన సుధీర్ అనే వ్యక్తి తన తల్లి సంగీతని డీజే రిపేర్ కోసం రూ. 20,000 అడిగాడు. అయితే తన కొడుకు వ్యసనాలకు బానిసయ్యాడని అనుమానించిన సంగీత డబ్బులు ఇవ్వడానికి నిరాకరించింది. దీంతో కోపోద్రిక్తుడైన సుధీర్ తన స్నేహితులతో కలిసి అక్టోబర్ 3న తల్లిని హత్య చేసి, అక్కడి నుంచి పారిపోయాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. దర్యాప్తులో భాగంగా మృతురాలి కొడుకే హత్య చేశాడని నిర్ధారించారు.