మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణంలోని ఆవుల రాజిరెడ్డి క్యాంపు కార్యాలయంలో హత్నూర మండలం కోనంపేట్ గ్రామానికి చెందిన సుమారు 60 మంది మంగళవారం బిఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి పిసిసి ప్రధాన కార్యదర్శి, నర్సాపూర్ నియోజకవర్గ ఇన్చార్జి ఆవుల రాజిరెడ్డి కండువా కప్పి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.