ఎలాంటి షరతులు లేకుండా రుణమాఫీ చేయాలి: బీకేఎస్

78చూసినవారు
ఎలాంటి షరతులు లేకుండా రైతు రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ సంగారెడ్డి జిల్లా భారతీయ కిసాన్ సంఘ్ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్ ఎదుట సోమవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా భారతీయ కిసాన్ సంఘ్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు నర్సింహారెడ్డి, పరియాద రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. జిల్లాలో రైతుల రుణమాఫీ సక్రమంగా అమలు కాలేదని, వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి షరతులు లేకుండా రుణమాఫీ అమలు చేయాలని డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్