సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ ఓబీసీ సెల్ అధ్యక్షులు డాక్టర్ సూర్యచంద్ర వర్మ జన్మదిన సందర్బంగా ఆదివారం సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి గజమాలతో సన్మానించి ఘనంగా జన్మదినం జరపుకోవడం జరిగింది. సూర్య వర్మ మాట్లాడుతూ తనకి జన్మదిన శుభకాంక్షలు తెలిపిన ప్రతి కార్యకర్తకి ధాన్యవాదాలు తెలిపారు. సిద్దిపేట జిల్లాలో బడుగు బలహీన వర్గాల పక్షాన వారి అభివృద్ధి కోసం ఎల్లప్పుడూ వారికి అండగా ఉంటామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు గరిపల్లి రాములు, బర్మా రామచంద్రం, భిక్షపతి, సోషల్ మీడియా కోఆర్డినేటర్ సంతోష్, మండల కిసాన్ సెల్ అద్యక్షులు ఎల్లం, గరిపల్లి వెంకటి, బంకా చిరంజీవి మరియూ భారీ ఎత్తున కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు.