భార్య కాపురానికి రావడం లేదని భర్త ఆత్మహత్య
భార్య కాపురానికి రావడం లేదని భర్త ఆత్మహత్య చేసుకున్న సంఘటన సిద్దిపేట జిల్లా తొగుట మండలం కాన్గల్ లో బుధవారం చోటు చేసుకుంది. గ్రామస్థులు, తొగుట ఎస్సై రవికాంతారావు తెలిపిన వివరాల ప్రకారం.. కాన్గల్ గ్రామానికి చెందిన కె. రాజు (30)కు భవానితో వివాహమైంది. చిన్న గొడవల కారణంగా ఆమె పుట్టింటికి వెళ్లిపోయింది. భార్య తిరిగి రాదేమోనని జీవితంపై విరక్తి చెంది మంగళవారం రాత్రి పొలంలో పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.