Apr 12, 2025, 06:04 IST/
తిరుమలలో అపచారం.. మహాద్వారం వరకు చెప్పులు వేసుకొని వచ్చిన భక్తులు
Apr 12, 2025, 06:04 IST
తిరుమలలో అపచారం చోటుచేసుకుంది. వీఐపీ బ్రేక్ దర్శనం కోసం క్యూలో భక్తులు వేచి ఉన్నారు. అందులో ముగ్గురు భక్తులు పాదరక్షలు ధరించినట్లు తిరుమల శ్రీవారి ఆలయ మహా ద్వారం దగ్గర గుర్తించారు. వెంటనే చెప్పులను పక్కన విడిచి ఆలయంలో శ్రీవారి దర్శనానికి వెళ్లారు. ఈ ఘటనతో టీటీడీ విజిలెన్స్ సిబ్బంది తీరుపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.