వివాన్‌కు రజతం.. అనంత్‌కు కాంస్యం

84చూసినవారు
వివాన్‌కు రజతం.. అనంత్‌కు కాంస్యం
ISSF ప్రపంచకప్ ఫైనల్ షూటింగ్ ఛాంపియన్‌షిప్‌లో భారత్ మరో రెండు పతకాలను సొంతం చేసుకుంది. ట్రాప్‌లో వివాన్‌కపూర్ రజతం నెగ్గగా.. స్కీట్‌లో అనంత్‌జీత్ సింగ్ కాంస్యం గెలుచుకున్నాడు. ట్రాప్ ఫైనల్లో వివాన్ 44 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచాడు. స్కీట్ తుదిపోరులో అనంత్‌జీత్ (43) కంచు కైవసం చేసుకున్నాడు. ఈ టోర్నీలో భారత్ గెలిచిన పతకాల సంఖ్య నాలుగుకు చేరింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్