అమెరికాలో కమలాపూర్ మండల వాసి అనుమానాస్పద మృతి

75చూసినవారు
అమెరికాలో కమలాపూర్ మండల వాసి అనుమానాస్పద మృతి
కమలాపూర్ మండలం మాదన్నపేట గ్రామానికి చెందిన వంశీ అనే యువకుడు అమెరికాలో అనుమానాస్పద స్థితిలో ఆదివారం మృతి చెందాడు. ఉన్నత చదువుల కొరకై అమెరికా వెళ్లిన బండి వంశీ అనుమానాస్పద స్థితిలో మృతి చెందినట్లు అక్కడి అధికారులు ఫోన్ ద్వారా వెల్లడించారని కుటుంబ సభ్యులు తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి మృతదేహాన్ని త్వరగా గ్రామానికి తెప్పించాలని వారు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్