జగిత్యాల నియోజకవర్గానికి చెందిన నలుగురు లబ్ధిదారులకు సిఎం సహాయ నిధి ద్వారా మంజూరైన రూ.1,50,000 రూపాయల విలువగల చెక్కులను శనివారం జగిత్యాల ఎమ్మెల్యే క్వార్టర్స్ లో ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ అందజేశారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ పంబాల రాంకుమార్, నాయకులు ధుమాల తిరుపతి, సుశీన్, నారాయణ, తదితరులు పాల్గొన్నారు.