విద్యార్థులు కష్టంతో కాకుండా ఇష్టంతో చదవాలని ఫ్రెండ్స్ వెల్ఫేర్ ట్రస్టు అధ్యక్షుడు సురిగి శ్రీనివాస్ అన్నారు. రాయికల్ పట్టణంలోని మంగళవారం ఇందిరానగర్ కాలనీలో మండల పరిషత్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలకు చెందిన 42 మంది పేద విద్యార్థులకు మెట్పల్లి ఫ్రెండ్స్ వెల్ఫేర్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సంవత్సరానికి సరిపడా ఉచిత నోట్ పుస్తకాలు, ఇతర సామగ్రి అందజేశారు. ఉపాధ్యాయులు, ట్రస్టు సభ్యులు పాల్గొన్నారు.